Cheliya Cheliya
Lyrics by : Kulasekhar
ఒమహ జియ్యా వాహి యాయా
వాహి యాయా జియ్యామేమసయ్యా
ఒమహ జియ్యా వాహి యాయా
వాహి యాయా జియ్యామేమసయ్యా
చెలియ చెలియ చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
ఒమహ జియ్యా వాహి యాయా
వాహి యాయా జియ్యామేమసయ్యా
ఒమహ జియ్యా వాహి యాయా
వాహి యాయా జియ్యామేమసయ్యా
చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్నాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా...
చెలియ చెలియ చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
తడిసి పోతున్నా, తడిసి పోతున్నా
చరణం: 1
శ్వాస నీవే తెలుసుకోవే
స్వాతి చినుకై తరలి రావే
నీ జతే లేనిదే నరకమే ఈ లోకం
జాలి నాపై కలగదేమే
జాడ అయినా తెలియదేమే
ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీ కోసం
ఎందుకమ్మా నీకీ మౌనం
తెలిసి కూడా ఇంకా దూరం
పరుగుతీస్తావు న్యాయమా ప్రియతమా...
చెలియ చెలియ చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
ఒమహ జియ్యా వాహి యాయా
వాహి యాయా జియ్యామేమసయ్యా
ఒమహ జియ్యా వాహి యాయా
వాహి యాయా జియ్యామేమసయ్యా
చరణం: 2
గుండెలోన వలపు గాయం
మంటరేపే పిదపకాలం
ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా
దూరమైన చెలిమి దీపం
భారమైన బతుకు శాపం
ప్రియతమా హృదయమా తరలిరా నే డైనా
కలవు కావా నా కన్నుల్లో
నిమిషమైనా నీ కౌగిలిలో
సేద తీరాలి చేరవా నేస్తమా...
చెలియ చెలియ చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్నాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా...
