Idi Cheragani Premaku

Lyrics by : Mallemala

image


పల్లవి :


ఇది చెరగని ప్రేమకు శ్రీకారం

ఇది మమతల మేడకు ప్రాకారం

పండిన కలలకు శ్రీరస్తు

పసుపు కుంకుమకు శుభమస్తు

కని విని ఎరుగని  అనురాగానికి

కలకాలం వైభోగమస్తు...  కలకాలం వైభోగమస్తు


ఇది చెరగని ప్రేమకు శ్రీకారం

ఇది మమతల మేడకు ప్రాకారం

పండిన కలలకు శ్రీరస్తు

పసుపు కుంకుమకు శుభమస్తు

కని విని ఎరుగని  అనురాగానికి

కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు


చరణం 1 :


కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు

రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు

పారాణి మిసమిసలు పదములకు తెలుసు

పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు

చిగురుటాశల చిలిపి చేతలు

పసిడి బుగ్గల పలకరింపులు

పడుచు జంటకే తెలుసు


ఇది చెరగని ప్రేమకు శ్రీకారం

ఇది మమతల మేడకు ప్రాకారం

పండిన కలలకు శ్రీరస్తు

పసుపు కుంకుమకు శుభమస్తు

కని విని ఎరుగని  అనురాగానికి

కలకాలం వైభోగమస్తు

కలకాలం వైభోగమస్తు


చరణం 2 :


ముగ్గులే తొలిపొద్దు ముంగిళ్ళకందం

శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం

మింటికి పున్నమి జాబిల్లి అందం

ఇంటికి తొలి చూలు ఇల్లాలు అందం

జన్మ జన్మల పుణ్యఫలముగా

జాలువారు పసిపాప నవ్వులే

ఆలు మగలకు అందం


ఇది చెరగని ప్రేమకు శ్రీకారం

ఇది మమతల మేడకు ప్రాకారం

పండిన కలలకు శ్రీరస్తు

పసుపు కుంకుమకు శుభమస్తు

కని విని ఎరుగని  అనురాగానికి

కలకాలం వైభోగమస్తు

కలకాలం వైభోగమస్తు