Narudaa O Narudaa

Lyrics by : Sirivennela Seetharama Sastry



ఆ. ఆఆ. ఆఆ ఆఆ

ఆ ఆఆ ఆఆ ఆ


నరుడా ఓ నరుడా ఏమి కోరికా.

నరుడా ఓ నరుడా. ఏమి కోరికా.

కోరుకో కోరి చేరుకో… చేరి ఏలుకో బాలకా

కోరుకో కోరి చేరుకో… చేరి ఏలుకో బాలకా


నరుడా ఓ నరుడా ఏమి కోరికా.


చరణం: 1


రా దొర… ఒడి వలపుల చెరసాలరా

లే వరా… ఇవి దొరకని సరసాలురా

దోర దోర సోకులేవి దోచుకో సఖా.

ఋతువే వసంతమై… పువ్వులు విసరగా.

ఎదలే పెదవులై… సుధలే కొసరగా.

ఇంత పంతమేల బాలకా.!


నరుడా ఓ నరుడా ఏమి కోరికా.

కోరుకో కోరి చేరుకో… చేరి ఏలుకో బాలకా.

నరుడా ఓ నరుడా ఏమి కోరికా.


చరణం: 2


నా. గిలి నిను అడిగెను తొలి కౌగిలీ.

నీ. కలి స్వరమెరుగని ఒక జావళీ.

లేత లేత వన్నెలన్ని వెన్నెలేనయా.

రగిలే వయసులో… రసికత నాదిరా.

పగలే మనసులో… మసకలు కమ్మెరా.

ఇంత బింకమేల బాలకా.


నరుడా ఓ నరుడా ఏమి కోరికా.

నరుడా ఓ నరుడా ఏమి కోరికా.

కోరుకో కోరి చేరుకో. చేరి ఏలుకో బాలకా

కోరుకో.. కోరి చేరుకో.. చేరి ఏలుకో బాలకా


నరుడా ఓ నరుడా. ఏమి కోరికా.

నరుడా ఓ నరుడా. ఏమి కోరికా.