Pranaamam
Lyrics by : Ramajogayya Sastry
పల్లవి:
ప్రణామం ప్రణామం ప్రణామం.
ప్రభాత సూర్యుడికి ప్రణామం.
ప్రణామం ప్రణామం ప్రణామం.
సమస్త ప్రకృతికి ప్రణామం.
ప్రమోదం ప్రమోదం ప్రమోదం.
ప్రతీ సృష్టి చిత్రం ప్రమోదం.
ప్రయాణం ప్రయాణం ప్రయాణం.
విశ్వంతో మమేకం ప్రయాణం..
చరణం: 1
మన చిరునవ్వులే పూలు
నిట్టూర్పులే తడి మేఘాలు
హృదయమే గగనం
రుధిరమే సంద్రం ఆశే పచ్చదనం.
మారే ఋతువుల వర్ణం
మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం
మనలో ప్రతిబిం.బం.
నువ్వెంత నేనెంత రవ్వంతా.
ఎన్నో ఏళ్లదీ సృష్టి చరిత
అనుభవమే దాచిందీ కొండంతా.
తన అడుగుల్లో అడుగేసి
వెళదాం జన్మంతా.
ప్రణామం ప్రణామం ప్రణామం.
ప్రభాత సూర్యుడికి ప్రణామం.
ప్రణామం ప్రణామం ప్రణామం.
సమస్త ప్రకృతికి ప్రణా. మం.
చరణం:2
ఎవడికి సొంతమిదంతా
ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడిది నాదే
హక్కని చెయ్యేస్తే ఎట్టా
తరములనాటి కథంతా
మన తదుపరి మిగలాలంట
కదపక చెరపక
పదికాలాలిది కాపాడాలంటా.
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం.
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్ల కన్నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లీ ఏ ఒక్కరు మిగలం
ప్రణామం ప్రణామం ప్రణామం.
ప్రభాత సూర్యుడికి ప్రణామం.
ప్రణామం ప్రణామం ప్రణామం.
సమస్త ప్రకృతికి ప్రణా. మం.