Vrepalliya Yeda Jhalluna

Lyrics by : Veturi Sundara Rama Murthy



పల్లవి:


వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా

ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా

ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి


చరణం: 1


కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మా బాలగోపాలుని

కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మా బాలగోపాలుని

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ

తాండవమాడిన సరళి గుండెల మోగిన మురళి ఇదేనా

ఇదేనా ఆ మురళి


చరణం: 2


అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై

మరలా వినిపించి మరులే కొలిపించి

అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై

మరలా వినిపించి మరులే కొలిపించి

జీవనరాగమై బృందావనగీతమై జీవనరాగమై బృందావనగీతమై

కన్నెల కన్నుల కలువల వెన్నలు దోచిన మురళి ఇదేనా

ఇదేనా ఆ మురళి

వేణుగానలోలుని మురిపించిన రవళి నటనలసరళి

ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి


చరణం: 3


మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి

మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి

సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై సంగీత నాట్యాల సంగమసుఖవేణువై

రాసలీలకే ఊపిరి పోసిన అందెలరవళి ఇదేనా ఇదేనా ఆ మురళి

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా

ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి