DhimmaTirige

Lyrics by : Ramajogayya Sastry



ఎవడు కొడితే దిమ్మదిరిగి

మైండ్ బ్లాకైపోద్దో..

ఆడే నా. మొగుడూ..


దుబాయెళ్లి సెంటే తెచ్చా

జపానెళ్లి పౌడరు తెచ్చా

మలేషియా మొత్తం తిరిగీ

మల్లెపూలు మల్లెపూలు

కోసుకొచ్చా కోసుకొచ్చా

చైనా సిల్కు పంచే తెచ్చా.

సింగాపూరు వాచీ తెచ్చా.

రంగూనెళ్లి రంగూ రంగు

కళ్లజోడు కళ్లజోడు

తీసుకొచ్చా తీసుకొచ్చా

పెట్టుకో ఉంగరాలే తెచ్చా...

ఐతే పట్టుకో నీకు చెయ్యందించా

ముస్తాబు ముద్దుగున్నదే మా కొత్తగున్నదే

ఓలమ్మోలమ్మో నిన్నే చూస్తే


దిమ్మదిరిగే దిమ్మా దిరిగే.

దుమ్ము దుమ్ముగా దిమ్మదిరిగే.

దిమ్మదిరిగే దిమ్మా దిరిగే

కమ్మ కమ్మగా దిమ్మదిరిగే.



దుబాయెళ్లి సెంటే తెచ్చా

జపానెళ్లి పౌడరు తెచ్చా

మలేషియా మొత్తం తిరిగీ

మల్లెపూలు మల్లెపూలు

కోసుకొచ్చా కోసుకొచ్చా

చైనా సిల్కు పంచే తెచ్చా.

సింగాపూరు వాచీ తెచ్చా.

రంగూనెళ్లి రంగూ రంగు

కళ్లజోడు కళ్లజోడు

తీసుకొచ్చా తీసుకొచ్చా


సిలకా సిన్నారి రామసిలకా

సింగారి జున్ను తునకా

రంగేళి రసగుళికా గుళికా

అదిరే సరుకా.


చరణం : 1


స్నానాలవేళ సబ్బుబిళ్లనౌతా

తడికనై నీకు కన్నుగొడతా

తువ్వాలులాగ నేను మారిపోతా

తీర్చుకుంట ముచ్చటా.

నీ గుండెమీద పులిగోరౌతా

నీ నోటికాడ చేప కూరౌతా

నీ పేరు రాసి గాలికెగరేస్తా

పైటచెంగు బావుటా

నువ్వేగాని కలకండయితే

నేనో చిన్ని చీమై పుడతా

తేనీగల్లె నువ్వెగబడితే

పూటకొక్క పువ్వులాగ నీకు జతకడతా


దిమ్మదిరిగే దిమ్మా దిరిగే.

దుమ్ము దుమ్ముగా దిమ్మదిరిగే.

దిమ్మదిరిగే దిమ్మా దిరిగే

కమ్మ కమ్మగా దిమ్మదిరిగే..


చరణం : 2


నీవంక చూసి మంచినీళ్లు తాగినా.

నే తాటికల్లు తాగినట్టు తూలనా.

తెల్లాని నీ ఒంటి రంగులోన

ఏదో నల్లమందు ఉన్నదే

నీ పక్క నుండి పచ్చిగాలి పీల్చినా.

ఏదోలా ఉంది తిక్కతిక్క లెక్కనా.

వెచ్చాని నీ చూపులోతున

బంగారు భంగు దాస్తివే.

మిర్రా మిర్రా మిరియం సొగసే.

పంటి కింద నలిగేదెపుడే.

కర్రా కర్రా వడియంలా నీ కౌగిలింతలోన

నన్ను నంజుకోర ఇప్పుడే.


దిమ్మదిరిగే దిమ్మా దిరిగే.

దుమ్ము దుమ్ముగా దిమ్మదిరిగే.

హే దిమ్మదిరిగే దిమ్మా దిరిగే

సమ్మ సమ్మగా. దిమ్మదిరిగే..