SongName

Lyrics by : Bhaskarabhatla Ravi Kumar



డోలె డోలె దిల్ జర జరా.

నిను ఓరఓర గని నరవరా.

జాగు మాని చెయ్ కలపరా.

జత చేరి నేడు జతి జరుపరా.

జర జల్ది జల్ది పెందలకడనే రారా.

ఒడి అంతరంగ సంబరమునకే రారా.

రాలుగాయవే రసికుడా

కసి కోకలాగు సరి సరసుడా

రార మాటుకే ముడిపడ

నిశికేళి వేళ జత చోరా..


చలేగ చలేగ యెహ్ హై ఇష్క్ జమాన

కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన

చలేగ చలేగ యెహ్ హై ఇష్క్ జమాన

కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన


చరణం: 1


అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా

పొదుగుతూ కుదురుగా నీలోనా.

ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా

దిల్ బర్ దేఖో నా.

మిస మిస కన్నె కొసరకు వన్నె వలపులతో వల పన్నీ.

నకసికలన్నీ నలుగును కొన్నే కలబడు సమయాన్నీ..

ఒడికి త్వరగా యా... బరిలో కరగా యా...

ఒడికి త్వరగా యా... ఓ బరిలో కరగా.


చరణం: 2


చిటుకిని విప్పేస్తా చెమటని రప్పిస్తా

తళుకుతో తెగబడి నీపైనా.

చటుకున చుంబిస్తా చనువుగా బంధిస్తా

సుందర దీవానా.

తొలితెరలన్నీ గడుసరి కన్నె తొలగును తమకాన్ని

కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని

తరలి దరికే యా... ఎగసి ఎదకే యా...

తరలి దరికే యా... ఎగసి ఎదకే.


జర జల్ది జల్ది పెందలకడనే రారా.

ఒడి అంతరంగ సంబరమునకే రారా.

రాలుగాయవే రసికుడా.

కసి కోకలాగు సరి సరసుడా.

రార మాటుకే ముడిపడా.

నిశికేళి వేళ జత చోరా


చలేగ చలేగ యెహ్ హై ఇష్క్ జమాన

కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన

చలేగ చలేగ యెహ్ హై ఇష్క్ జమాన

కరేగ కరేగ హర్ దిల్ కో దీవానా. వానా. వానా.