Snehitudaa
Lyrics by : Veturi Sundara Rama Murthy
నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో
నిద్దరోవు నీ ఒళ్ళో గాలల్లే తేలిపోతానోయ్
ఇలా డోలలుగేనో
ఆనందాలర్ధరాత్రి అందాల గుర్తుల్లో
నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు
శ్వాస తుది వరకూ వెలిగే వేదం
వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చరణం: 1
చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్
ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్
మనసే మధువోయ్
పువ్వు కోసే భక్తుడల్లె మెత్తగా
నేను నిద్రపోతే లేతగోళ్ళు గిల్లవోయ్
సందెల్లో తోడువోయ్
ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి
సేవలు సేయవలెగా
ఇద్దరమొకటై కన్నెరైతే తుడిచేవేలందం
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
నిన్న మునిమపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో
గాలల్లే తేలిపోతానో ఇలా డోలలూగేనో
ఆనందాలర్ధరాత్రి అందాల గుర్తుల్లో
నిన్ను వలపించ మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే
చరణం: 2
శాంతించాలి పగలింటి పనికే
శాంతించాలి పగలింటి పనికే
నీ సొంతానికి తెచ్చేదింక పడకే
వాలే పొద్దూ వలపే
వుల్లెన్ చొక్కా ఆరబోసే వయసే
నీటి చెమ్మ చెక్కలైన నాకు వరసే
ఉప్పు మూటే అమ్మైనా
ఉన్నట్టుండి తేస్త ఎత్తేసి విసిరేస్త
కొంగుల్లో నిన్నే దాచేస్తా
వాలాక పొద్దు విడుదల చేసి
వరమొకటడిగేస్తా
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు
శ్వాస తుది వరకూ వెలిగే వేదం
వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా